Stock Market | ట్రంప్ ఓటమితో స్టాక్‌మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 2,100 పాయింట్లు జంప్..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గురవారం లాభాల జోరు కొనసాగుతున్నది. అమెరికా ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలతో వరుసగా ఆరోరోజు కూడా సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ముడిచమురు (Crude Oil) ధరల పతనం మార్కెట్లకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది.
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గురవారం లాభాల జోరు కొనసాగుతున్నది. అమెరికా ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలతో వరుసగా ఆరోరోజు కూడా సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ముడిచమురు (Crude Oil) ధరల పతనం మార్కెట్లకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది. దాంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 2100 పాయింట్లకుపైగా ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 24,500 మార్క్ పైన కదలాడుతున్నది.
మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో సెన్సెక్స్ 2,124 పాయింట్లు పెరిగి 79,426 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 578 పాయింట్ల లాభంతో 24,538 వద్ద కొనసాగుతోంది. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. ఆటోమొబైల్ రంగ సూచీ 2.5 శాతం ఎగబాకింది. నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణిస్తున్నాయి. రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, కోల్ ఇండియా, ఎయిర్టెల్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలతో వాల్‌స్ట్రీట్ దూసుకెళ్లింది. డోజోన్స్ ఏకంగా 1500 పాయింట్లకుపైగా పెరుగగా ఎస్ అండ్ పీ 500 సూచీ 1.58 శాతం, నాస్డాక్ 1.44 శాతం ఎగబాకాయి. ఈ పరిణామాలు మన మార్కెట్లకు కలిసొచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గొచ్చనే అంచనాలతో చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.5 డాలర్ల వద్ద రెండు నెలల కనిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడింది.
నేటి ట్రేడింగ్‌లో 14 పైసలు పెరిగి 94.32 వద్ద కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి మన మార్కెట్లకు పెట్టుబడులు కొనసాగాయి. బుధవారం ఒక్కరోజే రూ.7284 కోట్ల విలువైన ఈక్విటీలను వారు కొనుగోలు చేశారు. ఒక్క రోజులో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరగడం 2025 అక్టోబర్ తర్వాత ఇదే తొలిసారి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
Supreme Court: నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్: సుప్రీంకోర్టు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

