రేపటి నుండి అర్వపల్లి దర్గా ఉత్సవాలు
మత సామరస్యానికి ప్రతికగా నిలిచే అర్వపల్లి శివారులో కొలువైన హజ్రత్ సయ్యద్ ఖాజా నసిరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఈ ఉర్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి...
– రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలి రామన్న భక్తులు
అర్వపల్లి, నవంబర్ 05 : మత సామరస్యానికి ప్రతికగా నిలిచే అర్వపల్లి శివారులో కొలువైన హజ్రత్ సయ్యద్ ఖాజా నసిరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఈ ఉర్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వేలాది భక్తులు తరలిరానున్నారు. వక్స్ బోర్డు, జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో పూజలు చేసి గంధాన్ని అత్యంత వైభవంగా భక్తుల నడుమ దర్గాకు తీసుకురానున్నారు. అనంతరం అర్ధరాత్రి ఖావ్వాలి నిర్వహిస్తారు. 7వ తేది శనివారం బాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చిరాగ్ కార్యక్రమం జరుగుతుంది.
ఈ ఉర్సుకు ముస్లింలతో పాటు హిందువులు కూడా హాజరై బాబాని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. జాతీయ రహదారి నుండి దర్గాకి వెళ్లే దారి గుంతలు పడి ఉండడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు వక్స్ బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్, జిల్లా ఇన్స్పెక్టర్ దస్తగిరి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్ఐలు, వంద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి అర్వపల్లి దర్గా ఉత్సవాలు
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Stock Market | ట్రంప్ ఓటమితో స్టాక్‌మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 2,100 పాయింట్లు జంప్..!
తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన లో లెవల్ చప్టా
AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

