Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు.
Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. 2022లో ఈ ముగ్గురూ ఎస్పీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. గౌరి గంజ్ నుంచి గెలిచిన రాకేష్ ప్రతాప్ సింగ్, గోసయ్గంజ్ నుంచి గెలిచిన అభయ్ సింగ్, కల్పి నుంచి గెలిచిన వినోద్ చతుర్వేది బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు ఇప్పటికే ఎస్పీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు.
2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు ఎస్పీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. 2027లో ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎస్పీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం అఖిలేష్ యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బగానే పరిగణించాలి. పార్టీ మారిన ముగ్గురూ ఎస్పీకి అత్యంత కీలకమైన నేతలే. మరికొందరు నేతలు కూడా ఎస్పీ నుంచి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ నుంచి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
కానీ, పరిస్థితి చూస్తుంటే మాత్రం ఎస్పీ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేలానే కనిపిస్తోంది. మరోవైపు ఎస్పీ.. కాంగ్రెస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. కానీ, సీట్ల పంచాయితీ మాత్రం తేలడం లేదు. అయితే, బీజేపీలో ఎమ్మెల్యేల చేరిక ప్రభావం ఎస్పీపై ఎంతవరకు ఉంటుందో చూడాలి. యూపీలో వరుసగా రెండుసార్లు యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా గెలిచి యూపీలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని బీజేపీ భావిస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

