రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు సబ్ స్టేషన్ వద్ద రైతులతో కలిసి ఆయన రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
– చిట్యాల మండలం వెలిమినేడు సబ్‌స్టేషన్ వద్ద రైతులతో కలిసి ధర్నా
– వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్
నల్లగొండ, అక్టోబర్ 14 : రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చిట్యాల మండలం వెలిమినేడు సబ్ స్టేషన్ వద్ద రైతులతో కలిసి ఆయన రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో గతంలో ఉన్న పరిస్థితులను మళ్లీ తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు నిజంగానే రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించలేని పరిస్థితులను తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వంటి విద్యుత్ ఉత్పత్తి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతుల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ మళ్లీ రావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి అని రైతులు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించి, రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో పాలన సాగించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతులను ఆదుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి రైతులకు సరిపడా నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించి ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో రైతుల ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చిరుమర్తి హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

