హైదరాబాద్, మే 29; రియల్మీ ప్రస్తుతం RMX3261 అనే మోడల్ నంబర్ ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందిస్తున్నది. ఈ ఫోన్ ఎఫ్‌సీసీ(ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) లిస్టింగ్‌లో కూడా కనిపించింది. దీనికి సంబంధించిన డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ ఎఫ్‌సీసీ లిస్టింగ్ ఫోన్ ముందువైపు, వెనకవైపు చూడవచ్చు. ఇందులో ముందువైపు సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో మూడు కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, రియల్మీ లోగో కూడా ఇందులో చూడవచ్చు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు ఫోన్ ఎడమవైపు ఉన్నాయి. ఈ ఫోన్ రియల్మీ సీ-సిరీస్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. దీని ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ ఫోన్ 4880 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
రియల్ మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.1, సింగిల్ బ్యాండ్ వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. దీని పొడవు 17.39 సెంటీమీటర్లుగానూ, బరువు 7.59 సెంటీమీటర్లుగానూ ఉండనుంది. ఐఎంఈఐ, టీకేడీఎన్, బీఐఎస్, ఇండోనేషియా టెలికాం సర్టిఫికేషన్ సైట్లలో ఈ ఫోన్ ఇప్పటికే కనిపించింది. రియల్ మీ RMX3261 మార్కెటింగ్ పేరు ఇంకా తెలియరాలేదు. అయితే ఎఫ్‌సీసీ సైట్లో కూడా కనిపించింది కాబట్టి త్వరలో లాంచ్ అవుతుందని అనుకోవచ్చు. ఈ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు తెలియరాలేదు.