బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు కష్టాల్లో పడింది. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో.. జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన మార్క్రమ్ (22) కూడా కాసేపటికే పెవిలియన్ చేరాడు. ఒక పక్క రాహుల్ త్రిపాఠీ పోరాడుతున్నా.. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం కరువైంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న నికోలస్ పూరన్ (19) కూడా నిరాశ పరిచాడు.
హసరంగ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి మిస్ అయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న షాబాజ్ అహ్మద్.. పరిగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు. దీంతో పూరన్ ఇన్నింగ్స్ ముగిసింది. 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ కష్టాల్లో కూరుకుపోయింది.