గ్లెన్ మ్యాక్స్వెల్ మరోసారి విజృంభించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (25), దేవదత్ పడిక్కల్ (40) జట్టుకు శుభారంభాన్నందించారు. వీరిద్దరూ కలిసి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కోహ్లీ అవుటయ్యాడు. అనంతరం డాన్ క్రిస్టియన్ (0) డకౌటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ (57) మరోసారి రెచ్చిపోయాడు. 4 సిక్సులు, 3 ఫోర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డివిలియర్స్ (23) కూడా రాణించినా దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. చివరి ఓవర్ వేసిన వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఆ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మొత్తంగా పంజాబ్ బౌలర్లలో షమీ, మోయిజెస్ హెన్రిక్స్ చెరో మూడు వికెట్లు కూల్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.