రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు
- అడ్మినిస్ట్రేటర్‌గా వై నాగేశ్వర్రావును నియమించిన ఆర్బీఐ

ముంబై, నవంబర్ 29: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డు రద్దయింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థ.. రుణదాతలకు వివిధ చెల్లింపులను చేయలేకపోతున్నది. ఈ క్రమంలోనే సంస్థ బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం రద్దు చేసింది. ప్రస్తుతమున్న బోర్డు.. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ఏ రకంగానూ పరిష్కరించేలా లేదని, అందుకే దాన్ని పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా పక్కన పెట్టామని ఈ సందర్భంగా ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై నాగేశ్వర్రావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దివాలా చట్టం కింద సంస్థ దివాలా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఇందులో భాగంగానే ఐఆర్‌పీగా ఓ అడ్మినిస్ట్రేటర్ నియామకాన్ని కోరుతూ ముంబై ఎన్సీఎల్టీకి ఆర్బీఐ వెళ్లనున్నది. ఇప్పటికే శ్రేయీ గ్రూప్, డీహెచ్ఎఫ్ఎల్పై దివాలా ప్రక్రియల్ని ప్రారంభించిన ఆర్బీఐ.. ఇప్పుడు మరో భారీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ రిలయన్స్ క్యాపిటల్పైనా ఆరంభించనున్నది. సెప్టెంబర్‌లో జరిగిన సాధారణ వార్షిక సమావేశం వివరాల ప్రకారం రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత రుణ భారం రూ.40వేల కోట్లు. ఈ జూలై-సెప్టెంబర్‌లో సంస్థ నష్టం రూ.1,156 కోట్లుగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం సంస్థ రూ.9,287 కోట్ల నష్టాల పాలైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- anil ambani
- rbl
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

