హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 24: వీరనారి బహుజన చాకలి అయిలమ్మ పౌండేషన్, బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్, రజక మిత్రమండలి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 26 శనివారం ఉదయం 10:30 గంటలకు కాపువాడ భద్రకాళి చెరువు సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని వీరనారి బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్ తెలిపారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమాజంలో అన్ని వర్గాల వారిని ఐక్యం చేసి బడుగు బలహీన వర్గాలను సంఘటితం చేసి ఉద్యమ పోరాటంలో ముందు నిలిచిన మహా వనితగా గుర్తింపు వచ్చింది. ఆ వీరినారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో స్మరించుకోవాలని బాధ్యత మనందరి పైన ఉన్నదన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, అధికార భాష సంఘం అధ్యక్షులు కూరపాటి వెంకట నారాయణ, కుడా మాజీ చైర్మన్ ఎస్.సుందర్ రాజు యాదవ్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటారన్నారు. అనంతరం వివిధ కుల సంఘాల చెందిన నాయకులు విశిష్ట సేవలందించిన వారిని సత్కరించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ రజక మిత్రమండలి వరంగల్ జిల్లా బాధ్యులు పాలడుగుల ఆంజనేయులు,ఓరుగంటి పూర్ణచందర్, చీకటి వీరస్వామి, నాగపురి సంతోష్ కుమార్, మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్, సాగంటి ప్రకాష్ పాల్గొన్నారు.