హీరో రవితేజ జోరు పెంచారు. మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుధవారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాల తాలూకు పాటను, ప్రచార చిత్రాలను విడుదలచేశారు. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ధమాకా’. ‘డబుల్ ఇంపాక్ట్’ ఉపశీర్షిక. త్రినాథరావు నక్కిన దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. బుధవారం స్పెషల్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో ైస్టెలిష్ లుక్‌లో హుషారుగా నృత్యం చేస్తూ ఆయన కనిపిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రవితేజ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
ఫ్లయింగ్కిస్..
‘డబ్బు, మానవీయ విలువలకు మధ్య జరిగిన పోరాటంలో గెలుపెవరిదో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు రమేష్‌వర్మ. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖిలాడి’. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయకానాయికలుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ‘నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్’ అనే పాటను బుధవారం విడుదలచేశారు. సాగర్, మమతా శర్మ ఆలపించిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. శేఖర్ మాస్టర్ నృత్యాల్ని సమకూర్చారు. ఈ పాటలో రవితేజ, డింపుల్ హయతి నృత్యాలు ప్రధానాకర్షణగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదలచేయబోతున్నారు.
రామారావు పోరాటం
రవితేజ హీరోగా శరత్‌మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. బుధవారం నుంచి హైదరాబాద్‌లో నాయకానాయికలపై ఓ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. వాణిజ్య హంగులకు కుటుంబ బంధాలు, ప్రేమ, యాక్షన్‌ను జోడించి రూపొందిస్తున్నాం. త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రను పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్.