Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Ration Rice Scam, PDS Rice Scam, Rice Smuggling, PDS Rice Black Market, Civil Supplies
Rice Scam | రంగారెడ్డి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని శివారు ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లులు రేషన్‌బియ్యం రీసైక్లింగ్‌కు అడ్డాగా మారాయి. మార్కెట్లో సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరగటంతో మిల్లర్లు తక్కువ ధరకు రేషన్ బి య్యాన్ని కొని తమ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి హైద రాబాద్ నగరానికి ఎగుమతి చేస్తున్నారు.
మంగ ల్‌పల్లి, పటేల్‌గూడ, బొంగుళూరు, శేరిగూడ, తుక్కుగూడ, మహేశ్వరం, ఆమనగల్లు, ఉప్పరి గూడ, పోచారం, ఎలిమినేడు, శంషాబాద్, కోహెడ, యాచారం, మంచాల, మొయినాబాద్,చేవెళ్ల వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైస్ మిల్లులు న్నాయి. మిల్లుల నిర్వాహకులు గ్రామాల వారీగా తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కిలోకు రూ.15-రూ.20 వరకు కొను గోలు చేసి.. వాటిని మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి మార్కె ట్లో కిలో వంద రూపాయల చొప్పున విక్రయిస్తూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందా కొంతకాలంగా శివారు రైస్ మిల్లులో యథేచ్ఛగా సాగుతున్నది.
రేషన్ బియ్యం దందాపై గత మూడు నెలల్లో జిల్లాలో 120 వరకు కేసులు నమోదయ్యా యి. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వరి దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో మిల్లర్లు పెద్ద ఎత్తున సివిల్‌సప్లయ్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి పలు గోదాముల్లో నిల్వ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ దందాపై సివిల్ సప్లయ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు దృష్టి సారించకపోవ టంపై పలు విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మరోవైపు శివారు ప్రాంతా ల్లోని రైస్ మిల్లర్లు సివిల్‌సప్లయ్ బియ్యంపై కోట్ల రూపాయల క్రయవిక్రయాలు జరుపుతున్నట్టు ఆరో పణలున్నాయి. తాజాగా, ఇబ్రహీంపట్నం మండ లంలోని మంగలపల్లిలోని న్యూబన్సల్ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొని రీసై క్లింగ్ చేసి 101 బస్తాల్లో ఉన్న 396 క్వింటాళ్ల బియ్యాన్ని సివిల్‌సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీ సులు స్వాధీనం చేసుకోవటంతో సివిల్‌సప్లయ్ బియ్యం దందా గుట్టురట్టయ్యింది.
జిల్లాకు ప్రతినెలా 15 వేల మెట్రిక్ టన్నులు..
ప్రభుత్వం ప్రతినెలా జిల్లాకు పీడీఎస్ ద్వారా 15 వేల మెట్రిక్ టన్నుల సన్నబి య్యాన్ని కేటా యిస్తున్నది. ఆ బియ్యాన్ని 6.75 లక్షల రేషన్‌కార్డులు కలిగిన లబ్ధిదా రులు పొందుతున్నారు. ఈ బియ్యాన్ని నిరు పేదలు సద్వినియోగం చేసుకుంటున్నా ఎక్కు వమంది బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొందరు రైసిమిల్లుల నిర్వాహకులు ఏజెం ట్లను నియమించి గ్రామాల వారీగా ఆ బియ్యాన్ని కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించి కొనుగోలు చేయిస్తున్నారు. బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసిన అనంతరం రూ.100కు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఆటోల ద్వారా ఇంటింటికీ తిరిగి ఆ బియ్యాన్ని సేకరించి రైసిమిల్లర్లకు విక్రయిస్తు న్నారు. దీంతో ప్రభుత్వం పీడీఎస్ బియ్యం రైస్ మిల్లర్లకు వరంగా మారింది.

Pds Rice Scam
మూడు నెలల్లో 120 కేసులు..
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న వ్యక్తులపై గత మూడు నెలల్లో 120 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లు లకు తరలిస్తుండగా పట్టుబడిన వారే అధి కంగా ఉన్నారు. జిల్లాలో నెలకు 10 -15 కేసులు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. వారిపై నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుండటంతో వెంటనే బయటికి వస్తున్నా రు. బియ్యం సీజ్ అయినా మళ్లీ ఈ వ్యాపా రాన్నే ఎంచుకుని యథేచ్ఛగా సాగిస్తున్నారు.
నిద్రావస్థలో నిఘా..
ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డులు కలిగిన వారికి ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుండగా.. ఆ రైస్ పక్కదారి పడుతున్నా సివిల్‌సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, సివి ల్సప్లయ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారన్న ఆరోపణలున్నాయి.
396 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…
ఆదిబట్ల, అక్టోబర్ 23 : మంగలపల్లి గ్రామంలోని న్యూబన్సల్ రైస్ | మిల్లులో సివిల్సరఫరా శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేసి 396 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం ఆ రైస్ ను ఇబ్రహీంపట్నం గోదాంకు తరలించి ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మిల్లులో గతంలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుపడినట్టు సమాచారం. ఈ దందాలో సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం, మోతెలోని భారతి ఇండస్ట్రీస్ పేరు తెరపైకి వచ్చింది. అక్కడి నుంచే బియ్యాన్ని కొన్నట్టు న్యూబన్సల్ రైస్ మిల్లు నిర్వాహకులు చెప్పినట్టు తెలుస్తున్నది. కాగా, భారతి ఇండస్ట్రీస్ నుంచి న్యూబన్సల్ రైసి లుతోపాటు మరో రెండు మిల్లులకూ రేషన్ బియ్యం సరఫరా జరి గినట్టు ఆరోపణలున్నాయి. ఆ రైస్‌మిల్లుల పేర్లు పోలీసుల దర్యా ప్తులో వెల్లడి కానున్నది.
ముగ్గురిపై కేసు నమోదు..
నాలుగు వాహనాలు సీజ్ న్యూబన్సల్ రైస్ మిల్లు యజమాని గీతేశ్ భన్సల్, బియ్యం సరఫరాదారుడు శ్రీరామ్ లోహియా, భారతి ఇండస్ట్రీస్ యజమాని నాగ భూషణంపై రేషన్ బియ్యం అక్రమ దందాలో ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నాలుగు వాహనాలను సీజ్ చేసి ఠాణాకు తరలించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

