కాన్బెరా: మిడతలు చెంగుచెంగున ఎగురుతూంటాయి. పొలాలకు అవి చేసే మష్టం మాటెలా ఉన్నా చురుకుదనానికి మాత్రం అవి చిరునామాగా ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో తాజాగా ఓ భారీ మిడత కనబడింది. దాని బరువు ఎంతుందీ అంటే ఎగరలేనంత అని చెప్పాలి. క్వీన్స్‌ల్యాండ్‌లో మౌంట్ కాటన్ స్టేట్ స్కూల్ కోసం అదనపు గదులు నిర్మిస్తుండగా పనివారికి ఈ మిడత కనబడింది. అది ఓ చిన్నసైజు ఎలుకంత ఉందని వారు తెలిపారు. వర్షాధార అడవుల అంచున ఆ స్కూల్ ఉంటుంది. ఆ అడవిలో నుంచే మిడత వచ్చిందని అనుకుంటున్నారు. అప్పుడప్పుడూ ఎన్నోరకాల జంతువులను చూస్తుంటాం.. కానీ సైజు మిడతను ఇప్పటి వరకు చూడలేదని స్థానికులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం మిడత ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేయగా వందల లైకులు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. భారీ మిడతను జయంట్ వుడ్మాత్ అంటారని శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మిడతజాతి అని పేర్కొంటున్నారు. అవి ఎగిరేది చాలాచాలా తక్కువట. ఆడవి మగవాటి కన్నా రెట్టింపు సైజు ఉంటాయి. రెక్కల వెడల్పు 25 సెంటీమీటర్ల దాకా ఉంటుంది.