Rashmi Gautam | దాదాపు 12 ఏళ్లుగా ప్రేక్షకులని అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ షోకి ఎంతో మంది యాంకర్స్ వచ్చారు, వెళ్లారు. కమెడీయన్స్ మారారు, జడ్జెస్ మారారు. అయిన కూడా ఈ షో అన్‌స్టాపబుల్‌గా వినోదం పంచుతూనే ఉంది. ముందు అనసూయ ఈ షోకి యాంకర్‌గా వ్యవహరించగా, ఆ తర్వాత రష్మీ కూడా జాయిన్ అయింది. దాదాపు ప్రారంభం నుండి ఈ కామెడీ షోకి యాంకర్‌గా ఉంటూ అలరిస్తుంది రష్మి. అయితే ఒక్కోసారి రష్మీపై జబర్ధస్త్ కమెడీయన్స్ కొన్ని పంచ్‌లు విసురుతారు. కొన్నింటిని లైట్ తీసుకుంటుంది, మరి కొన్నింటిపై మాత్రం సీరియస్ అవుతుంది.
తాజాగా జబర్ధస్త్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, ఇందులో బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ వర్ష కలిసి కొత్తగా పెళ్లి చేసుకుంటారు. తమ పెళ్లికి జడ్జ్ లు ఖుష్బూ, శివాజీ వచ్చారు, కానీ రష్మి ఎందుకు రాలేదని వర్ష ప్రశ్నించింది. అప్పుడు భాస్కర్.. మార్చి 1న మన పెళ్లి రోజు, అదే రోజు పెన్షన్ వచ్చే రోజు కూడా , కాబట్టి అవి తీసుకోవడానికి వెళ్లి ఉంటుంది అని తెలిపారు. దెబ్బకి రష్మి మొహం మాడిపోయింది. కాని ఆ వెంటనే సెటైర్ వేస్తుంది. మీరు పెన్షన్ మిస్ అయ్యారా అంటూ పంచ్ వేసింది. ఆ తర్వాత జబర్దస్త్ వర్ష వెళ్లిపోగా, భాస్కర్ ఒక్కడే నిలుచొని ఉన్నాడు.
అప్పుడు భాస్కర్.. రష్మి వైపు చూస్తూ రమ్మంటూ సైగలు చేశాడు. ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. మరో ఆలోచన లేకుండా రష్మీ.. చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చింది. అసలు నీకు సిగ్గు ఉందా? మీ ఇంట్లో అక్కా చెల్లెళ్లు లేరా? అంటూ నిలదీసింది. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదు అంటూ చాలా సీరియస్ అయింది. అందరు షాక్ అయిపోయారు. అయితే అప్పుడు కాస్త కవర్ చేస్తూ.. అక్కా చెల్లెళ్లు ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నామని కవర్ చేసుకున్నాడు. దాంతో రష్మీ ముఖంలో నవ్వులు పూసాయి. మొత్తానికి భాస్కర్.. రష్మీపై తెగ సెటైర్స్ వేసి షోని మరింత రక్తి కట్టించాడు. ఏప్రిల్ 4,5 తేదిలలో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.