అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. 21వ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో రెండో టెస్ట్‌లో రషీద్ 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 98 ఓవర్లు వేసిన రికార్డును తాజాగా రషీద్ బ్రేక్ చేశాడు. 1998లో ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 113.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జింబాబ్వేతో రెండో టెస్ట్‌లో అఫ్గనిస్థాన్ 6 వికెట్లతో విజయం సాధించింది.