Danushka Gunatilaka | అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన దనుష్క గుణతిలకకు షరతులతో కూడిన బెయిల్
డేటింగ్ యాప్స్‌ను, సోషల్‌మీడియా ఖాతాలను ఉపయోగించవద్దని ఆదేశాలు
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక మాజీ ఆటగాడు దనుష్క గుణతిలకకు గురువారం సిడ్నీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిడ్నీలోని డౌనింగ్ సెంట్రల్ కోర్టు మెజిస్ట్రేట్ జానెట్ వాహల్క్విస్ట్ 1,50,000 డాలర్ల పూచీకత్తుతో అతడికి బెయిల్ ఇచ్చారు. టిండర్‌తో పాటు ఇతర డేటింగ్ యాప్స్‌ను, సోషల్‌మీడియా ఖాతాలను ఉపయోగించవద్దని, ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సంతకం చేయాలని కూడా బెయిల్ కండీషన్స్‌లో పేర్కొన్నారు.
సిడ్నీలోని పర్క్లియ జైలులో ఉన్న దనుష్క ఆడియోవిజ్యువల్ లింక్ ద్వారా కోర్టు వాదనలకు హాజరయ్యాడు. అయితే, పోలీసుల తరఫు న్యాయవాది కెర్రీ అన్ మెక్కిన్నొన్ మాత్రం దనుష్కకు బెయిల్ ఇవ్వవద్దని మెజిస్ట్రేట్‌ని కోరాడు. దనుష్క ఏక్షణంలోనైనా దేశం విడిచివెళ్లే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇస్తే ఫిర్యాదు చేసిన మహిళ ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చని వాదనలు వినిపించాడు. ఒకవేళ దనుష్క ఆస్ట్రేలియా పౌరుడు అయి, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని ఉంటే అతనికి బెయిల్ ఇచ్చేవాళ్లం కదా! అని మెజిస్ట్రేట్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన కోర్టు దనుష్క కేసు వాదనలు విననుంది.
టిండర్ అనే డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను ఆత్యాచారం చేశాడనే కేసులో సిడ్నీ పోలీసులు అక్టోబర్ 6వతేదీన దనుష్కను అరెస్ట్ చేశారు. ఆ టైంలో అతను హయత్ రెజెన్సీ హోటల్లో శ్రీలంక టీమ్‌తో ఉన్నాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన ఇతను టీ 20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు. అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్ అయిన దనుష్కని శ్రీలంక బోర్డు అన్ని ఫార్మాట్ల నుంచి ఇప్పటికే తొలగించింది. దనుష్కపై అత్యాచారం ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇతను నాలుగుసార్లు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

