Ranveer Singh | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్’ షూటింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన భార్య దీపికా పదుకోన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో, ఆమెకు మద్దతుగా రణ్వీర్ తన ముద్దుల కుమార్తె దువాతో కలిసి అక్కడికి వెళ్లారు. షూటింగ్ విరామ సమయంలో రణ్వీర్ ఎంతో సరదాగా గడిపారు. బ్లాక్ టీ-షర్ట్, కార్గో ప్యాంట్, సన్ గ్లాసెస్ మరియు బీనీ టోపీతో స్టైలిష్‌గా కనిపించిన ఆయనను చూసి అభిమానులు ఎగబడ్డారు. రణ్వీర్ కూడా ఏమాత్రం తడుముకోకుండా వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో గౌరి ఖాన్ నిర్మిస్తున్న ఈ ‘కింగ్’ చిత్రం ద్వారా షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు.
Even Ranveer was with the KING team during the shooting, he met some fans 😭 pic.twitter.com/mJVMjaWER7
— Asma Zebari (@asmasun01) May 8, 2026