Ranveer Singh | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సెట్స్‌లో రణ్వీర్ సింగ్ సందడి.. వైరల్ అవుతున్న ఫొటోలు
Ranveer Singh | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్' షూటింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
Ranveer Singh | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్’ షూటింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన భార్య దీపికా పదుకోన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో, ఆమెకు మద్దతుగా రణ్వీర్ తన ముద్దుల కుమార్తె దువాతో కలిసి అక్కడికి వెళ్లారు. షూటింగ్ విరామ సమయంలో రణ్వీర్ ఎంతో సరదాగా గడిపారు. బ్లాక్ టీ-షర్ట్, కార్గో ప్యాంట్, సన్ గ్లాసెస్ మరియు బీనీ టోపీతో స్టైలిష్‌గా కనిపించిన ఆయనను చూసి అభిమానులు ఎగబడ్డారు. రణ్వీర్ కూడా ఏమాత్రం తడుముకోకుండా వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో గౌరి ఖాన్ నిర్మిస్తున్న ఈ ‘కింగ్’ చిత్రం ద్వారా షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు.
Even Ranveer was with the KING team during the shooting, he met some fans 😭 pic.twitter.com/mJVMjaWER7
— Asma Zebari (@asmasun01) May 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

