కందుకూరు/మహేశ్వరం, డిసెంబర్ 6: రైతులు ఇతర పంటలపై దృష్టి సారించి ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తెలిపారు. సోమవారం కందుకూరు, మహేశ్వరం మండలాల్లో పర్యటించారు. కందుకూరు మండలం పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ రైతులతో మాట్లాడారు. యాసంగిలో పండిస్తున్న వరి పంటను ఎఫ్‌సీఐ (భారత ప్రభుత్వం) సేకరించమని తెలిపిందని సూచించారు. ఈ సీజన్లో ఇతర పంటలు వేసుకోవాలని సూచించారు. ఇకనుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో వెంకటాచారి, మండల వ్యవసాయాధికారి కోటేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి యాదగిరి, ఏఈవోలు అర్చన, అనూష, సర్పంచ్ గౌర ప్రభాకర్, ఎంపీటీసీ రేఖ, వార్డు మెంబర్ శ్రీనివాస్‌గౌడ్, నర్సింహ, మల్లేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, రైతులు జగన్‌గౌడ్, తిరుపతయ్య, వెంకటేశ్ గౌడ్, అంజయ్య, కిరణ్, భిక్షపతి, సత్తయ్య, తుమ్ములూరు మాజీ సర్పంచ్ మద్ది కరుణాకర్ రెడ్డి, పంచాయతి కార్యదర్శి నరేందర్, గ్రామ కో ఆర్డినేటర్ మహబూబ్, రైతులు పాల్గొన్నారు.