బషీరాబాద్, నవంబర్ 2 : పేద ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ కట్టు బడి ఉందని, గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద దుకాణ సముదాయాలకు భూమి నిర్వహించి, కొర్విచేడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పానాది రోడ్ల నిర్మాణాలకు నిధులు మం జూరు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు సూచనలు సల హాలతో బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అనంతరం కొర్విచేడ్ గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ నవీన్‌రెడ్డి, యువజన సంఘం నాయకుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
దుకాణ సముదాయాలకు భూమిపూజ
మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తాత లింగారెడ్డి జ్ఞాపపకార్థం తన సొంత ఖర్చులతో ఎనిమిది దుకాణ సముదాయాల నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే నారా యణరావు, టీర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీశైల్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అదేవిధంగా పంచలోహాలతో తయారు చేయనున్న అయ్యప్ప స్వామి విగ్రహం కిరీటానికి తన వంతు సహాయంగా వెండి, బంగారాన్ని సమర్పించారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రామునాయక్, నాయకులు నర్సిరెడ్డి, గోపాల్‌రెడ్డి, రాజారత్నం, అబ్దుల్జ్రాక్, వీరారెడ్డి పాల్గొన్నారు.