ఐదేళ్ల ప్రణయబంధానికి సాఫల్యంగా బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్‌కపూర్-అలియాభట్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. గురువారం వీరి పెళ్లివేడుక ముంబయి బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలందజేశారు. ఈ జంట పెళ్లి ఫొటోలు సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.