సీతాఫలం గురించి అందరికీ తెలుసు. రామాఫలం గురించి కొందరికే తెలుసు. అరుదుగా లభించే ఈ పండులో పోషక విలువలు మెండు. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రొటీన్, విటమిన్ బి1,బి2,బి3,బి5,బి6, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
-మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి