Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Ramayana Box Office | భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణం' (Ramayana: Part 1) బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది.
Ramayana Box Office | భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana: Part 1) బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా నటిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం జోరు తగ్గించకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదలైన కేవలం 7 రోజుల్లోనే (వారం రోజుల్లో) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 934.55 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో ఇండియా గ్రాస్ రూ. 611.05 కోట్లు (నెట్ రూ. 511.10 కోట్లు) ఉండగా, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 323.50 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. వర్కింగ్ డేస్‌లోనూ థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి తగ్గకపోవడంతో, ఈ చిత్రం అతి త్వరలోనే ప్రతిష్టాత్మకమైన రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పౌరాణిక చిత్రాల చరిత్రలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ‘రామాయణం’ సృష్టిస్తున్న ఈ ప్రభంజనం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
Suriya | కోలీవుడ్‌లో సూర్య సరికొత్త చరిత్ర.. మూడు సినిమాలతో రూ.800 కోట్ల మైలురాయి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

