హైదరాబాద్ : కాకతీయుల శిల్పకళా వైభవం రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం సంతోషకరమన్నారు. తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. ఈ సందర్భంగా యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తర్వాత హైదరాబాద్కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపు.. మన తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు.
This is the first world heritage site from Telangana
— KTR (@KTRTRS) July 25, 2021
Next aim is to get world heritage city status for our capital city #Hyderabad 👍
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం