బాన్సువాడ(కామారెడ్డి): సామాజిక సమానత్వం (Social equality) కోసం బీఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ (Ramabai Ambedkar) కృషి చేశారని బాన్సువాడ దళిత సంఘాల నాయకులు బంగారు మైసయ్య, గైని రవి తెలిపారు. రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా బాన్సువాడ ఆర్అండ్ బీ అతిథిగృహంలో దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మాతృమూర్తి రమాబాయి (Ramabai) అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మన్నే చిన్న సాయిలు, బేగరి సాయిలు, రాజు, శివయ్య, మన్నె నాగభూషణం, బేగరి కొత్తపల్లి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.