రామ్‌చరణ్ ‘పెద్ది’ జూన్ 25న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌క్రియేట్ అయింది. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘పెద్ది’ షూటింగ్ పూర్తికావడంతో.. సుకుమార్ దర్శకత్వంలో తాను చేయబోయే తదుపరి సినిమాపై దృష్టిపెడుతున్నారు రామ్‌చరణ్.
‘ఆర్సీ17’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్‌చరణ్-సుకుమార్ కాంబోలో రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘రంగస్థలం’ ‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాల్లో రూరల్, మాస్ కథాంశాల్ని చూపించిన దర్శకుడు సుకుమార్..‘ఆర్సీ17’ కోసం పంథా మార్చుకొని అర్బన్ కథను సిద్ధం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. నగర నేపథ్యంలో ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారట. మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.