Ram Charan | వయోలెంట్ మూవీగా రూపొంది అందరిని అలరిస్తున్న చిత్రం హిట్ 3. ఈ మూవీ ఒక టార్గెట్ ఆడియన్స్‌ని అలరిస్తుంది అని అందరు అనుకున్నారు. కాని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో క్యూ కట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్రను వైలెంట్‌గా డిజైన్ చేసిన ఆ పాత్ర ప్రేక్షకులకి నచ్చేసింది. మే 1న పానిండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ మూవీకి సెలబ్రిటీల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంతో పాటు నానిని ఆకాశానికి ఎత్తేశారు.
హిట్ 3సినిమా అద్భుతమైన విజయం సాధించడం పట్ల రామ్ చరణ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ.. నా ఆత్మీయ సోదరుడు నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, విభిన్న జానర్లలో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తున్నాడంటూ కొనియాడారు.యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకు కూడా హ్యాట్సాఫ్.. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీంకు శుభాకాంక్షలు అంటూ ప్రశంసలు కురిపించారు రామ్ చరణ్. గతంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు సైతం భారీ విజయాన్ని సాధించగా, హిట్ 3 మూవీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అంచనాలకి తగ్గట్టే ఈ చిత్రం భారీ విజయం సాధించింది. చిత్రంలో డార్క్ వెబ్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి అనేది చూపించారు. ఇక తాజాగా దర్శకుడు శైలేష్ మాట్లాడుతూ.. ఎలాంటి పాత్రనైనా సమర్ధవంతంగా హ్యాండిల్ చేయగల మంచి నటుడు నాని అని, మృదులగా శ్రీనిధి శెట్టి అద్భుతంగా పర్ఫార్మ్ చేసిందని, , సముద్రఖని, రావురమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారని అన్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చే చివరి సినిమాలో హీరోలందర్నీ ఒకే స్క్రీన్‌పై చూపించాలనుకుంటున్నానని, అందుకే.. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే క్యామియోస్లో విశ్వక్సేన్ని హైడ్ చేశానని శైలేష్ కొలను చెప్పారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.