Rakasa OTT | యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన క్రేజీ ఫాంటసీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’ డిజిటల్ సందడికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా, తాజా సమాచారం ప్రకారం మే 1, 2026 నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన హోమ్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. హారర్ ఎలిమెంట్స్‌కు స్వచ్ఛమైన కామెడీని జోడించి రూపొందించిన ఈ కథాంశం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, మరియు హిందీ వంటి ఐదు ప్రధాన భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది.