PM Modi | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు.. స్పందించిన ప్రధాని మోదీ
PM Modi | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై హోటల్లో జరిగిన కాల్పుల ఘటనపై దేశ ప్రధాని మోదీ స్పందించారు.
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై హోటల్లో జరిగిన కాల్పుల ఘటనపై దేశ ప్రధాని మోదీ స్పందించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. హింసను ప్రతి ఒక్కరు నిస్సందేహాంగా ఖండించాలన్నారు. ఈ ఘటనలో ట్రంప్, మెలానియా, జేడీ వాన్స్ క్షేమంగా ఉండటంతో ఊరట చెందామన్నారు. కాగా, ట్రంప్‌పై(US President Trump) హత్యాయత్నం కలకలం రేపింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో(White House Correspondents’ Dinner) దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారు 5 నుంచి 8రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కాగా, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో పోస్ట్ చేస్తూ దీనిని ‘ఒక అద్భుతమైన సాయంత్రం’ అని అభివర్ణించారు. సీక్రెట్ సర్వీస్, లా ఎన్ఫోర్స్మెంట్ వేగంగా, ధైర్యంగా అద్భుతంగా పనిచేశాయని ప్రశంచారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని, అయితే తాను పూర్తిగా లా ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాలను పాటిస్తానన్నారు. ఈ ఘటనలో ట్రంప్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వెంట్లో పాల్గొన్న వందాలది మంది టేబుళ్ల కింద దాక్కొని ప్రాణాలను కాపాడుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

