Donald Trump | ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి.. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్
Donald Trump | అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ (Correspondents Dinner Meet) లో ఒక్కసారిగా తుపాకీ మోతలు మోగడం కలకలం రేపింది. ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు వందలాదిగా హాజరైన ఈ ప్రతిష్టాత్మక విందులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Donald Trump : అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ (Correspondents Dinner Meet) లో ఒక్కసారిగా తుపాకీ మోతలు మోగడం కలకలం రేపింది. ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు వందలాదిగా హాజరైన ఈ ప్రతిష్టాత్మక విందులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ అనూహ్య ఘటన నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో సహా ప్రముఖులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ట్రంప్ వైట్ హౌస్‌లో సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు.
కాల్పుల ఘటనను అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. ఘటన గురించి ట్రంప్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పగా.. ఘటనా స్థలంలో ఒక లాంగ్ గన్, తుపాకీ షెల్స్ లభ్యమైనట్లు కాష్ పటేల్ ధృవీకరించారు. అయితే నిందితుడి వద్ద ఉన్న ఆయుధాల గురించి మరిన్ని వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవని చెప్పారు. ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తాను ఎంతో పదునైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితులవల్ల తదుపరి కార్యక్రమంలో తన ప్రసంగం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
తాను ప్రసంగించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నానని, కానీ భద్రతాకారణాల దృష్ట్యా వచ్చేసారి చాలా సాదాసీదాగా వ్యవహరిస్తానని ట్రంప్ చెప్పారు. ఈ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో తాము ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదికపైనే ఉండాలని తాను గట్టిగా ప్రయత్నించానని, కానీ భద్రతాబలగాల సూచన మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కాల్పుల ఘటన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించిన తీరును ఆయన అభినందించారు.
‘సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా స్పందించిందని, కాల్పులు జరిపిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్‌కు చెందిన కొందరు అదుపులోకి తీసుకున్నారని ట్రంప్ వెల్లడించారు. ఘటనలో పారదర్శకత, స్పష్టత కోసం తాను విడుదల చేయమని ఆదేశించిన ఒక టేప్‌ను ఇప్పుడే అధికారులు విడుదల చేశారని తెలిపారు. త్వరలోనే కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్‌ను తిరిగి నిర్వహిస్తామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

