Superstar Rajinikanth | 2026 నూతన సంవత్సరం సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, తన కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ముత్తు’ సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్‌ను గుర్తు చేశారు. పోయే రూటు కరెక్టేనా అని అడగకండి.. అంతా దేవుడి మీద భారం వేసి ముందుకు సాగడమే! అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటూ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. చెన్నైలోని తన నివాసం (పోయిస్ గార్డెన్) వద్దకు వేలాది మంది అభిమానులు తరలివచ్చి తమ ‘తలైవా’కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, రజనీకాంత్‌ను ఒక్కసారైనా చూడాలనే ఆశతో అభిమానులు బుధవారం రాత్రి నుంచే ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. “తలైవా.. తలైవా” అంటూ నినాదాలు చేస్తూ, కేకులు కట్ చేస్తూ సందడి చేశారు.
— Rajinikanth (@rajinikanth) January 1, 2026