Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్‌లో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారు. కరోనా వల్ల గత నాలుగు సంవత్సరాలు హిమాలయాలకు దూరంగా ఉన్న రజినీ తన తాజా సినిమా జైలర్ విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు.
Jailer Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dileep Kumar) తెరకెక్కించిన తాజా చిత్రం జైలర్ (Jailer). యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటీవ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.
అన్నాత్తే (Annathe) వంటి భారీ డిజాస్టార్ తర్వాత అటు రజనీకాంత్, బీస్ట్ ప్లాఫ్ తర్వాత ఇటు నెల్సన్ ఇద్దరు మాస్ కంబ్యాక్ ఇచ్చారని నెటిజెన్లు తెలుపుతున్నారు. ఇక తన సినిమాల విడుదలకు ముందు రజినీ హిమాలయా యాత్రకు వెళతాడన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల గత నాలుగు సంవత్సరాలు హిమాలయాలకు దూరంగా ఉన్న రజనీ జైలర్ విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి రజనీ హిమాలయాలకు వెళ్లగా.. వంతెనపై తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాడు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, నుదుటిపై బొట్టు పెట్టుకుని రజనీ ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest pic of superstar RAJINIKANTH #Jailer pic.twitter.com/tRZLCYx8xB
— Manobala Vijayabalan (@ManobalaV) August 10, 2023