రాజస్థాన్‌లో 11.5లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వృధా : కేంద్రమంత్రి
రాజస్థాన్‌లో 11.5లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వృధా : కేంద్రమంత్రి | రాజస్థాన్‌లో 11.5లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వృధా అయ్యాయని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. అయితే, రాజస్థాన్‌లో వ్యాక్సిన్ వృధా రెండు శాతం కంటే తక్కువగా ఉందని, ఇది జాతీయ సగటు 6 శాతం కంటే తక్కువ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

జైపూర్: రాజస్థాన్‌లో 11.5లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వృధా అయ్యాయని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. అయితే, రాజస్థాన్‌లో వ్యాక్సిన్ వృధా రెండు శాతం కంటే తక్కువగా ఉందని, ఇది జాతీయ సగటు 6 శాతం కంటే తక్కువ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ల వృధాను మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అఖిల్ అరోరా ఖండించారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఆయా జిల్లాల్లో టీకాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.
వ్యాక్సిన్ బాటిల్స్‌ను చెత్త కుప్పల్లో వేసినట్లు వచ్చిన మీడియా కథనాలను ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి రాజస్థాన్ ప్రభుత్వం.. టీకాలు వేయడంలో కేరళను చూసి నేర్చుకోవాలన్నారు. టీకా డ్రైవ్‌పై అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదట 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల వారికి టీకాలు వేసేందుకు అనుమతి కోరిందని, గ్లోబల్ టెండర్ల నాటకం ఆడిందని విమర్శించారు. అది విజయవంతం కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిందిస్తుందని వర్చువల్ మీడియా సమావేశంలో గజేంద్ర షెకావత్ ఆరోపణలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 9 వరకు యాదాద్రిలో దర్శనాల నిలిపివేత
ఈ- మెయిల్ హ్యాక్ చేసి.. స్నేహితుడిగా నమ్మించి
12-15 ఏళ్ల వారికి ‘ఫైజర్’ టీకాకు జపాన్ ఓకే..
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

