హైదరాబాద్ : జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, కుషాయిగూడ, చర్లపల్లి, కీసర, రాంపల్లి బోయినపల్లి, చిలుకలగూడ, మారేడ్‌పల్లి, బేగంపేట, సికింద్రాబాద్ ప్యాట్నీ, ప్యారడైజ్, అల్వాల్, బాలానగర్, చింతల్, గాజులరామరాం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల వాన కురుస్తోంది. అలాగే పాతబస్తీ, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లితో పాటు పలు చోట్ల వాన కురుస్తోంది. మరో వైపు నగరంలో వినాయక నిమజ్జనం కొనసాగుతున్నది. వానలోనూ శోభయాత్ర కొనసాగుతున్నది. ఒక్కసారిగా వర్షం కురువడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.