Rain Alert | తెలంగాణలో రెండు రోజులు భారీ వానలు
Rain Alert | రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షలు కురుస్తాయని తెలిపింది. శనివారం హైదరాబాద్‌తో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నిండు కుండలా నాగార్జున సాగర్.. 10 గేట్లు ఎత్తివేత
Traffic Restrictions | నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
అసలేంటి.. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్టులు.. వీటిని వాతావరణ శాఖ ఎలా జారీ చేస్తుంది?
Rain Alert | తెలంగాణలో రెండు రోజులు భారీ వానలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

