హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉద్యోగ ఖాళీల భర్తీకి రైల్వే శాఖ నిర్లక్ష్యం వహించడం పట్ల మిగిలిన ఉద్యోగులపై పనిభారం పెరుగుతున్నదని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు చోడవరపు అన్నారు. సోమవారం రైల్వే శాఖ వైఖరిని వ్యతిరేకిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలోని పలు స్టేషన్లలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శంకరరావు మాట్లాడుతూ నాలుగు రకాల లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.