హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట సమయంలో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్న గాంధీ వైద్యులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ‘కార్పొరేట్లో బతకడన్నరు.. గాంధీలో ప్రాణం పోశారు’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని ఆదివారం ట్వీట్ చేశారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా, ప్రభుత్వ దవాఖానలు నిలుస్తున్నాయని ప్రశంసించారు. రామాంతపూర్‌కు చెందిన కరోనా బాధితుడు సురేశ్‌కుమార్‌కు గాంధీ వైద్యులు అందించిన చికిత్సే దీనికి ఉదాహరణ అన్నారు. రెండుసార్లు కరోనా సోకి పూర్తిగా ఊపిరితిత్తులు పాడైపోయిన సురేశ్‌కుమార్‌కు గాంధీ వైద్యులు ఆరు నెలలపాటు వైద్యం అందించి, ప్రాణాలను కాపాడారు. సుమారు రూ.కోటి విలువైన వైద్యాన్ని అందించారు.