
నారాయణపేట టౌన్, డిసెంబర్ 11 : విద్యార్థులకు నా ణ్యతతో కూడిన విద్యను అందించాలని మణిపూర్ యూనివర్సిటీ చాన్స్‌లర్, సరస్వతీ విద్యాపీఠం ప్రాంతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ తిరుపతిరావు అన్నారు. శనివారం పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాలలో నూతన జాతీయ విద్యా విధానం 2020పై వర్క్‌షాప్ నిర్వహించా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ విద్య ప్రతి ఒక్కరికీ అ వసరమని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూ డా అందేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నైపుణ్య ఆ ధారిత విద్యను అందించడం, ఉపాధ్యాయ శిక్షణపై ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం ఎన్ఈపీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్ఈపీ సరస్వతీ విద్యా భారతి క్షేత్ర సంయోజక్ మురళి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థి సహజసిద్ధమైన సామర్థ్యాలను పెంపొందించుకుంటూ సంతోషకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలన్నారు. అదేవిధంగా పలువురు వక్తలు ఓవర్ వ్యూ ఆఫ్ ఎన్ఈపీ, ఈసీసీఈ, లర్నింగ్ అవుట్ కమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, ఐటీ అప్లికేషన్స్, ఒకేషనల్ ఎడ్యుకేషన్, భారతీయ శిక్షా దర్శన్, భారతీయ మనోవిజ్ఞానం తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఈఎల్టీఏ శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్, సంపత్‌కుమార్, పాలమూరు విభాగ్ శైక్షానిక్ ప్రముఖ్ చంద్రశేఖర్ గుప్తా, డీఎస్పీ మధుసూదన్‌రావు, పాఠశాల అధ్యక్షుడు ర తంగ పాండురెడ్డి, నాయకులు శ్రీనివాసులు, నాగూరావు నామాజీ, పాఠశాల ప్రధానాచార్యులు దత్తూచౌదరి, ఉమ్మ డి జిల్లాలోని సరస్వతీ శిశు మందిరాల ఆచార్యులు, మాతాజీలు తదితరులు పాల్గొన్నారు.