హైదరాబాద్: స్టార్ షట్లర్ పీవీ సింధు తనలో దాగిన డ్యాన్సింగ్ స్కిల్స్‌ను కూడా బయటపెట్టింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. గతంలో కచ్చా బాదాం లాంటి సాంగ్‌కు స్టెప్పులేసిన సింధు ఈసారి మరో డ్యాన్సింగ్ వీడియోతో ఆకట్టుకున్నది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ ఆడియోకు ఆమె తన కాళ్లు కదిపింది. మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో, అది చేయాలని సింధు తన వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చింది. ట్రెండింగ్‌లో ఉన్న రెండు ఆడియాలకు సంబంధించిన రిమిక్స్పై ఆమె డ్యాన్స్ చేసింది. ఈ పోస్టకు ఇప్పటికే లక్షల మంది లైక్ చేశారు. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.