Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
Puvvada Ajay | బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకుని వేగవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
Puvvada Ajay | బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకుని వేగవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలి, రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్, ప్రతి గ్రామంలో నమోదు చేసిన పట్టభద్రుల ఓట్లను రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ‘పార్టీ యాప్’ ద్వారా మన ఓటర్ల నమోదు వివరాలను అప్లోడ్ చేయలన్నారు.
పట్టభద్రుల ఓటర్ నమోదు కోసం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ ఐడీ కార్డ్, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఫారమ్‌లను నింపి నమోదు చేయించాలి. గ్రామాల్లో వేలాది మంది పట్టభద్రులు ఉన్నారు. నాయకులు నేరుగా ఇళ్లకు వెళ్లి, అర్హులైన ప్రతీ పట్టభద్రుడి వివరాలు సేకరించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు.ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థత లేకపోవడం వల్ల వచ్చిన చేతకానితనపు కరువు అని దుయ్యబట్టారు. వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలు ఇంకా స్పష్టంగా బయటపడతాయని, ప్రజల మైండ్ సెట్ కూడా మారిపోతుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కేడర్ అంతా అలర్ట్‌గా ఉండి నిరంతరం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు. పిలుపునిచ్చిన వెంటనే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని కోరారు. పార్టీ బలాన్ని పెంచేందుకు, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఈ ఓటర్ నమోదు అత్యంత కీలకమని, నాయకులు అలసత్వం వహించకుండా మిగిలిన గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో నాయకులు బచ్చు విజయ్ కుమార్, నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతి రెడ్డి,కూరాకుల వలరాజు, కొనకంచి ప్రసాద్, వల్లభనేని రామారావు,వీరు నాయక్, మద్దినేని వెంకటరమణ, గుత్తా రవి, హరిప్రసాద్,పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు,లక్ష్మణ్ నాయక్, యాస రామారావు,పెంట్యా,శంకర్,రాజా,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

