life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
life imprisonment to priest | గుడిని సందర్శించే బాలికల అసభ్యకర వీడియోలను ఒక పూజారి రికార్డ్ చేశాడు. వాటిని విదేశీయులకు విక్రయించాడు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఆ పూజారిని దోషిగా నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
లక్నో: గుడిని సందర్శించే బాలికల అసభ్యకర వీడియోలను ఒక పూజారి రికార్డ్ చేశాడు. వాటిని విదేశీయులకు విక్రయించాడు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఆ పూజారిని దోషిగా నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. (life imprisonment to priest) ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామంలోని ఆలయ పూజారి అయిన శ్యామ్ బిహారీ, గుడికి వచ్చే బాలికలను ‘ప్రసాదం’ ఇస్తానని నమ్మించి ఒక గదిలోకి పిలిచేవాడు. ఆ గదిలో బాలికలపై అసభ్యకరమైన చర్యలకు పాల్పడి వీడియో రికార్డ్ చేశాడు. డబ్బు కోసం ఆ వీడియోలను విదేశీయులకు విక్రయించాడు.
కాగా, ఈ విషయం ఇంటర్‌పోల్ దృష్టికి వచ్చింది. దీంతో భారత ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో 2025 జూన్ 17న సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పూజారి శ్యామ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించడంతో పాటు నెలలోపే దర్యాప్తును పూర్తి చేశారు. 2025 ఆగస్ట్ 18న కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడైన పూజారి శ్యామ్ బిహారీని దోషిగా మథుర కోర్టు నిర్ధారించింది. జీవిత ఖైదుతో పాటు రూ.1.43 లక్షల జరిమానా విధించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బ్రిజేష్ కుమార్ ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
Dia Mirza: దియా మీర్జా దివాళీ వీడియో డిలీట్ చేసిన బీఎంసీ
గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
YS Jagan | ఏపీ ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Khawaja Asif | మా దేశ ఫారిన్ పాలసీని నడిపిస్తున్నది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పిన పాకిస్థాన్ రక్షణ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

