ఆనంద్ దేవరకొండ, గీత్సైని, శాన్వీ మేఘన నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. నవంబర్ 12న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మధ్యతరగతి అనుబంధాలకు దర్పణంలా ఉండే చిత్రమిది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగిగా ఆనంద్ దేవరకొండ కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ఆంధ్రా, సీడెడ్‌లో సురేష్ ప్రొడక్షన్స్, నైజాంలో గ్లోబల్ సినిమాస్, ఓవర్సీస్లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు పంపిణీచేయబోతున్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. ఈ నెల 30న ట్రైలర్‌ను విడుదలచేయబోతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.