నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ ఎంపీడీవో కార్యాలయాన్ని పురాణీపేట్ గ్రామస్తులు ముట్టడించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ఇంటికి ఇద్దరు చొప్పున మహిళలు, పురుషులు తరలి వచ్చి ఆందోళనకు దిగారు.
తమ గ్రామ శివారులో మూడెకరాల బర్లమంద స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని, దీనిపై మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించక పోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.