తిరుమల : కర్ణాటక సంగీత పితామహులు పురందరదాసుల ( Purandara Das ) ఆరాధనా మహోత్సవాలు దాససాహిత్య ప్రాజెక్టు జనవరి 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల ( Tirumala ) లో నిర్వహిస్తున్నామని టీటీడీ( TTD ) అధికారులు వివరించారు.
తొలి రోజు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, సంకీర్తనమాలను నిర్వహిస్తామన్నారు.
జనవరి 18న ఉదయం 6 గంటలకు అలిపిరి వద్ద పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల , సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.
చివరిరోజు 19న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, ఉపన్యాసాలు, సంగీత విభావరి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.