Binder Garcha | కెనడాలో భారతీయుడి దారుణ హత్య.. ఇంటికి సమీపంలోనే మృతదేహం
Binder Garcha | కెనడా (Canada) దేశంలో ఓ భారతీయుడు (Indian) దారుణ హత్యకు గురయ్యాడు. సర్రే నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఈ హత్య జరిగింది. హతుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా (48) గా గుర్తించారు.
Binder Garcha : కెనడా (Canada) దేశంలో ఓ భారతీయుడు (Indian) దారుణ హత్యకు గురయ్యాడు. సర్రే నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఈ హత్య జరిగింది. హతుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా (48) గా గుర్తించారు. బిందర్ గర్చా మృతదేహం తన ఇంటికి కొంత దూరంలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. కాగా బిందర్ కొన్నేళ్లుగా కెనడాలోనే నివాసం ఉంటూ స్టూడియో-12 పేరుతో ఫొటో స్టూడియో నడుపుతున్నట్లు తెలిసింది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పులకు పాల్పడిన దుండగులు వాడినదిగా భావిస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బిందర్ గర్చాపై కాల్పులు జరిపిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

