న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: జేఎన్యూ కొత్త వీసీగా తెలుగు మూలాలున్న శాంతిశ్రీ ధూళిపూడి పండిత్(59) నియమితులయ్యారు. తద్వారా ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఐదేండ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు జేఎన్యూ వీసీగా ఉన్న మామిడాల జగదీశ్ యూజీసీ చైర్మన్గా వెళ్లారు. శాంతి శ్రీ ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిభాయి ఫూలే వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె జేఎన్యూలోనే ఎంఫిల్, పీహెచ్డీ చేశారు.