యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ రంగం వేగంగా విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతున్నదని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన ‘బ్రాంకోస్కోపీ బేసిక్స్ టు అడ్వాన్స్’ అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బేసిక్స్ నుంచి అధునాతన డయాగ్నస్టిక్స్, అత్యంత క్లిష్టమైన థెరప్యూటిక్స్‌పై ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ పల్మనాలజీ నిపుణులు చర్చించినట్టు తెలిపారు. జంతు నమానాలు, కేస్ స్టడీస్ ఆధారంగా చికిత్స విధానాలను సైతం తెలుసుకొన్నట్టు చెప్పారు. ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా సంబంధిత వైద్యుల నైపుణ్యాలు సైతం మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రపంచ ప్రఖ్యాత పల్మనాలజీ వైద్యనిపుణులు డాక్టర్ హెర్వ్డు టౌ, మలేషియాకు చెందిన డాక్టర్ జమ్లాల్ అజీజ్ బిన్ అబ్దుల్ రెహమాన్, న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ రాజీవ్గోయల్, వెల్లూరుకు చెందిన డాక్టర్ ప్రిన్స్ జేమ్స్లతోపాటు 400 మందికిపైగా వివిధ దేశాల పల్మనాలజీ నిపుణులు పాల్గొన్నట్టు మలక్‌పేట యశోద దవాఖాన ఇంటర్వేన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ తెలిపారు.