అమరావతి : ఏపీలో మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న దాడులపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ప్రేమోన్మాది (Psycho attack) బ్లేడుతో నర్సుపై దాడి చేసి గాయపరిచాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సు ( Nurse ) గా పనిచేస్తున్న యువతి పెళ్లికి తిరస్కరించడంతో క్రాంతి అనే యువకుడు ఆపై కక్షను పెంచుకున్నాడు.
ఆదివారం ఉదయం వడ్డేశ్వరంలోని వసతిగృహం వద్ద యువతిపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. అక్కడే ఉన్న స్థానికులు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ యువతిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.