రెండ్రోజులు పీఆర్టీయూ కౌన్సిల్ భేటీ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంఘం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన, నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు నల్లగొండ వేదిక కానున్నది. గంథంవారి గూడెం రోడ్డులోని గుండెగోని మైసయ్య కన్వెన్షన్ హాలులో గురు, శుక్రవారాల్లో ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీచర్ ఎమ్మెల్సీ పింగళీ శ్రీపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి రానున్నారు.
- ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా
- 33 జిల్లాల నుంచి రానున్న 3వేల మంది ప్రతినిధులు
రామగిరి, అక్టోబర్ 13: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంఘం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన, నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు నల్లగొండ వేదిక కానున్నది. గంథంవారి గూడెం రోడ్డులోని గుండెగోని మైసయ్య కన్వెన్షన్ హాలులో గురు, శుక్రవారాల్లో ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీచర్ ఎమ్మెల్సీ పింగళీ శ్రీపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి రానున్నారు.
రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు 3వేల మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. కాగా, సమావేశాల తొలిరోజు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వానికి సమర్పించాల్సిన వినతులు, సంఘం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. రెండోరోజు నూతన కమిటీ ఎన్నిక, ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
సభలను విజయవంతం చేయాలి : భిక్షంగౌడ్
నల్లగొండ, అక్టోబర్ 14: పీఆర్టీయూ రాష్ట్రస్థాయి కౌన్సిల్ సమావేశాలను మూడు వేల మందితో నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని ఈ సమావేశాలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ రెండురోజుల సమావేశాల్లో పాత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవటంతోపాటు రానున్న రెండేండ్లలో సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర క్రమశిక్షణా సంఘం రాష్ట్ర చైర్మన్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, డీవీఎస్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

