గవర్నర్‌గా ఉంటా.. బీజేపీకి పనిచేస్తా!
విధేయత ప్రకటించిన ఒడిశా కొత్త గవర్నర్ బ్రజ్ మోహన్ రామ్.. ఆయన నిష్పాక్షికతపై సందేహాలు: ప్రతిపక్ష బీజేడీ
భువనేశ్వర్: ఒడిశా గవర్నర్‌గా కొత్తగా నియమితులైన బ్రజ్ మోహన్ రామ్ రాజకీయ వివాదానికి తెరతీశారు. ఒడిశాలో బీజేపీకి మరిన్ని ఓట్లు సాధించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొనడం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఆయన నిష్పాక్షికతపై బీజేడీ ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది. ఒడిశాలో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని గవర్నర్ చెప్పడం విని మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. గవర్నర్ నిష్పాక్షికంగా ఉండాలనే సూత్రానికి ఈ ప్రకటన విరుద్ధం అని బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి బుధవారం విమర్శించారు.
రాంచీలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒడిశాలో బీజేపీ ఎస్సీ మోర్చాను మరింత చురుకుగా పనిచేసేలా చేస్తానని రామ్ చెప్పారు. ఆ రాష్ట్రంలో పార్టీకి అధిక ఓట్లు లభించేలా కృషి చేస్తానని కూడా ఆయన తన సంకల్పాన్ని బయటపెట్టారు. నేను జార్ఖండ్‌లో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా ఆ విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశాను.
ఒడిశాలో కూడా ఎస్సీ మోర్చా ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానిని మరింత క్రియాశీలంగా చేయడానికి కృషి చేస్తాను అని ఆయన అన్నారు. తనను తాను నిజాయితీపరుడైన, విధేయుడైన బీజేపీ కార్యకర్తగా అభివర్ణించుకున్న రామ్ తన కృషిని గుర్తించి రాజ్యాంగబద్ధమైన పదవిలో నియమించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.
దుష్యంత్ భండారీని అరెస్టు చేయాలి
తమ కుమార్తె అంకితా భండారీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం కొత్త గవర్నర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన తెలిపారు. రిషీకేష్లోగల వనన్తారా రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏండ్ల అంకితా భండారీ 2022 సెప్టెంబర్ 18న హత్యకు గురయ్యారు. సిట్ చార్జిషీట్ ప్రకారం ఆమెను లైంగిక సేవలు అందించమని బలవంతం చేయగా ఆమె అందుకు నిరాకరించడంతో హత్యకు గురయ్యింది. బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడైన పులకిత్ ఆర్య ఈ రిసార్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో దుష్యంత్ కుమార్ పేరు కూడా చార్జిషీట్లో ఉందని బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు.
సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేవరకు దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించవద్దని అంకిత తండ్రి వీరేంద్ర సింగ్ భండారీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించారు. దుష్యంత్ కుమార్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బాధితురాలి తల్లి సోనీ దేవి కోరారు. ఆయన(దుష్యంత్ కుమార్) గవర్నర్‌గా నియమితులయ్యారన్న వార్త విన్నప్పుడు మేము తీవ్ర వేదనకు గురయ్యాము. రాష్ట్రపతి మా ఆవేదనను అర్థం చేసుకోగలరన్న నమ్మకం ఉంది అని ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

