హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాలిక రుణాలు నిరర్థకంగా (ఎన్పీఏలు)గా మారిన రైతులకు డెట్ స్వాపింగ్ పద్ధతిలో తిరిగి రుణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి డీఎల్ఎస్ఏ, ఎంఎల్ఎస్ఏలకు ఆదేశాలు జారీచేశారు. ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్స్ అమలులో భాగంగా ఎన్పీఏ రుణాలపై లోక్ అదాలత్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఆయా జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్లు అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి బ్యాంకర్లు, సంబంధిత స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఆదేశాల ప్రతిని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌తోపాటు రిట్ పిటిషన్ వేసిన శ్రీహరిరావుకు, ఎస్ఎల్బీసీ చైర్మన్‌కు పంపినట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలిపింది.